కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

Six people died in a road accident in Kakinada district. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాళ్లరేవు మండలం సీతారామపురం

By Medi Samrat  Published on  14 May 2023 3:41 PM IST
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాళ్లరేవు మండలం సీతారామపురం సుబ్బరాయుని దిబ్బ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించినవారందరూ మహిళలే. ఓ ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మహిళలు ఓ రొయ్యల పరిశ్రమలో పనిచేసి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది.

తాళ్లరేవు మండలం సీతాపురం దగ్గరా రొయ్యల ఫ్యాక్టరీలో పని చేసి ఆటోలో తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు.


Next Story