లోయ‌లో ప‌డ్డ‌ స్కూల్ బస్‌.. ఆరుగురు మృతి

లడఖ్‌లోని లేహ్ జిల్లాలోని దుర్బుక్ సమీపంలో గురువారం పాఠశాల బస్సు రోడ్డుపై నుండి జారి లోయ‌లో పడటంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు

By Medi Samrat
Published on : 22 Aug 2024 4:10 PM IST

లోయ‌లో ప‌డ్డ‌ స్కూల్ బస్‌.. ఆరుగురు మృతి

లడఖ్‌లోని లేహ్ జిల్లాలోని దుర్బుక్ సమీపంలో గురువారం పాఠశాల బస్సు రోడ్డుపై నుండి జారి లోయ‌లో పడటంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. డెప్యూటీ కమిషనర్ లేహ్.. సంతోష్ సుఖ్‌దేవ్ మాట్లాడుతూ, పాఠశాలకు చెందిన బస్సులో సిబ్బంది కూడా ఉన్నారు. బస్సు దుర్బుక్ ప్రాంతానికి వెళుతుండగా ప్రమాదానికి గురైంది.

ఆరుగురు మరణించారని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని, గాయపడిన వారందరినీ ప్రథమ చికిత్స కోసం సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని ప్రత్యేక వైద్యం కోసం లేహ్‌కు తరలించనున్నట్లు డెప్యూటీ కమిషనర్ తెలిపారు.

గురువారం తెల్లవారుజామున.. బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గజరాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీబీగంజ్ వంతెన సమీపంలోని అరా-బక్సర్ రహదారిపై జీపు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Next Story