తమిళనాడులో మరోసారి అలాంటి ఘోరమే..!

Six dead, 23 injured in blaze at Tamil Nadu firework unit. తమిళనాడు రాష్ట్రంలో మరోసారి బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు.

By Medi Samrat  Published on  12 Feb 2021 6:10 PM IST
23 injured in blaze at Tamil Nadu firework unit
తమిళనాడు రాష్ట్రంలో మరోసారి బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించటంతో 11 మంది సజీవ దహనం అయ్యారు. ఈ సంఘటన విరుద్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. విరుద్‌నగర్‌ జిల్లా అచన్‌కులమ్‌లోని బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. దీంతో అక్కడ ఉన్న నాలుగు షెడ్లకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలు అదుపుచేయటానికి దాదాపు 30 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో 11మంది మృత్యువాతపడగా.. ఇరవైకి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


మధురై నగరానికి ప్రమాదం జరిగిన ప్రాంతం 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యాహ్నం 1:45 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మరియమ్మాళ్ ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీలో ఉన్న కెమికల్స్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 10 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. ఈ ఫ్యాక్టరీ ఓనర్ ను వెతికే పనిలో పోలీసులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ ఘటనపై బాధను వ్యక్తం చేశారు. "Heartfelt condolences to the victims of the firecracker factory fire in Virudhunagar, Tamil Nadu. It's heart wrenching to think of those still trapped inside. I appeal to the state government to provide immediate rescue, support & relief," అంటూ ట్వీట్ చేశారు.




Next Story