15 ఏళ్ల బాలికపై ఆరుగురు అబ్బాయిలు.. వేర్వేరు ప్రాంతాల్లో పదే పదే అత్యాచారం

Six boys arrested for mass sexual assault of minor girl in Karnataka. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్‌ బాలిక ఆరుగురు అబ్బాయిలు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

By అంజి  Published on  27 Dec 2021 8:11 AM GMT
15 ఏళ్ల బాలికపై ఆరుగురు అబ్బాయిలు..  వేర్వేరు ప్రాంతాల్లో పదే పదే అత్యాచారం

కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్‌ బాలిక ఆరుగురు అబ్బాయిలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అభం శుభం తెలియని మైనర్ బాలికపై 17 ఏళ్ల వయస్సు గల ఆరుగురు అబ్బాయిలు అత్యాచారం చేశారు. కాగా నిందితులు ఆరుగురు అబ్బాయిలను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం ఆరుగురు అబ్బాయిలు మైనర్లే, 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఫిర్యాదు చేయడానికి వ్యతిరేకంగా మైనర్‌ బాలికను బెదిరించారు. మొత్తం ఆరుగురు నిందితులు బాలికపై వేర్వేరు ప్రాంతాల్లో అత్యాచారం చేసి, జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. మూడు నెలల వ్యవధిలో వివిధ ప్రదేశాలలో బాలికపై పదేపదే అత్యాచారం చేసిన ఆరోపణను ఇప్పుడు అబ్బాయిలు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో, వారు తమ మొబైల్ ఫోన్లలో నేరాన్ని చిత్రీకరించారు.

డిసెంబర్ 26న, బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ధార్వాడ్ జిల్లా లక్ష్మీసింగంకేరిలో ఆరుగురు అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నారు. ధార్వాడ్‌లోని ఒక పోలీస్ స్టేషన్‌లో 15 ఏళ్ల బాధిత కుటుంబీకుల ఫిర్యాదుపై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనూష జి నేతృత్వంలోని బృందం విచారణ చేపట్టింది. నిందితులు వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా కొంత డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పాఠశాలకు వెళ్తున్న బాలికతో కాలేజీ కుర్రాళ్లు కొన్ని నెలల క్రితం పరిచయస్తుల ద్వారా స్నేహం చేశారు. బాలికకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనూష జి నేతృత్వంలోని దర్యాప్తు బృందం నిందితులు ఇంకా మైనర్లు కావడంతో వారి పేరును వెల్లడించలేదు. నిందితులు చట్టానికి విరుద్ధంగా ఉన్న పిల్లలుగా పరిగణించబడుతున్నందున పోలీసులు వారి పేర్లను పేర్కొనలేదు.

Next Story
Share it