నవవధువుకు షాక్.. నైటీ వేసుకున్న భర్త..
Shock to the bride. ఎన్నో ఆశలతో ఆ యువతి పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టింది. కొత్త జీవితంపై ఎన్నో కలలు కంది.
By Medi Samrat Published on 22 Dec 2020 12:20 PM IST
ఎన్నో ఆశలతో ఆ యువతి పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టింది. కొత్త జీవితంపై ఎన్నో కలలు కంది. అయితే.. తొలి రాత్రే ఆమెకు కాళరాత్రి అయింది. భర్త పైశాచికంగా ప్రవర్తించి గాయపరిచాడంటూ పోలీసులను ఆశ్రయించింది ఆయువతి. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా.. నరసారావుపేటకు చెందిన యువతి కూడా అదే ఉద్యోగం చేస్తోంది. వీరిద్దరికి అక్టోబర్ నెలలో పెద్దలు పెళ్లి చేశారు.
ఎన్నో కొత్త కలలతో తన వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన యువతికి తొలిరాత్రి చేదు అనుభవం ఎదురైంది. భర్త ప్రవర్తనతో విస్తుపోయిన ఆమె.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే.. యువకుడు భయపడుతున్నాడని పెద్దలు ఆ యువతిని సముదాయించారు. కొంత సమయం ఇస్తే సర్దుకుంటాడని పెద్దలు భావించారు. రెండు రోజుల కిందట మళ్లీ మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. అయితే ఆరోజు వరుడు తన భార్య నైటీ వేసుకుని వింతగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మర్మావయాలు, ఇతర శరీర భాగాలపై బ్లేడ్‌తో గాయపరిచాడు.
ఈ విషయాన్ని వధువు పెద్దలకు తెలియజేసింది. పెద్దలు విషయాన్ని వరుడి కుటుంబం వద్ద ప్రస్తావించగా.. వధువు సంసారానికి పనికి రాదంటూ అతడి కుటుంబం గొడవ పెట్టుకుంది. దీంతో ఆ యువతి తన తల్లిదండ్రులను తీసుకుని ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు.. నరసరావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చి.. ఆమె ఫిర్యాదు పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.