శివసేన నేతపై తీవ్ర అభియోగాలు
shivsena leader raghunath kuchik charged with rape. మహారాష్ట్రలోని పూణెలో 24 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి, బలవంతంగా అబార్షన్ చేయించిన
By Medi Samrat Published on
17 Feb 2022 1:39 PM GMT

మహారాష్ట్రలోని పూణెలో 24 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి, బలవంతంగా అబార్షన్ చేయించిన ఆరోపణలపై స్థానిక శివసేన నాయకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, శివసేన కార్మిక విభాగం భారతీయ కాంగర్ సేన ప్రధాన కార్యదర్శి రఘునాథ్ కూచిక్‌పై ఐపిసి సెక్షన్ 376 (రేప్), 313 (మహిళ అనుమతి లేకుండా గర్భస్రావం చేయించడం) కింద కేసు నమోదు చేయబడిందని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
"కుచిక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో మహిళతో స్నేహం చేసాడు. ఫిర్యాదు ప్రకారం, అతను ఆమెను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి ఆమెతో శారీరక సంబంధాలు ఏర్పరచుకున్నాడు" అని పోలీసులు తెలిపారు. ఫిర్యాదుదారు గర్భం దాల్చినప్పుడు బలవంతంగా అబార్షన్ చేయించుకున్నారని తెలిపారు. కుచిక్ మాత్రం ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా చెప్పాడు. తాను ఆ మహిళ చేతిలో హనీ-ట్రాప్‌కు గురయ్యానని పేర్కొన్నాడు.
Next Story