వీధుల్లో దోపిడీలకు పాల్పడే ముగ్గురు హిజ్రాలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 11న పిసిఆర్ కాల్‌పై కిషన్‌గఢ్ ప్రాంతంలో ఒక వ్యక్తిపై దోపిడీకి పాల్పడిన సంఘటన గురించి తమకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకోగా బాధితుడు మనోజ్ కుమార్ సింగ్ తనపై దాడి జరిగిందని పోలీసులకు చెప్పాడు. మునిర్కా నుండి లాడో సరాయ్ నుండి తన ఇంటికి వెళ్ళే మార్గంలో, ముగ్గురు హిజ్రాలు అతన్ని ఆపి బలవంతంగా ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వారు అతనిని దోచుకున్నారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ప్రాంతం చాలా చీకటిగా ఉంది. తొలుత నిందితులు అతడిని కొట్టి బెదిరించి డబ్బులు, ఏటీఎం కార్డుతో పాటు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అన్ని బస్టాండ్లు, కొన్ని ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు.
విచారణలో బాధితుడు తనపై దాడి చేసిన ముగ్గురు హిజ్రాలను పోలీసులు కనుగొన్నారు. పోలీసులు వెంటనే ఆ ముగ్గురు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారు తమ పేర్లను శ్రేయ, కవీనా, చాందినిగా తెలిపారు. ఈ ముగ్గురు చాలా కాలంగా ఈ తరహా దోపిడీలు చేస్తున్నారు. విచారణలో ఈ ముగ్గురు మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడ్డామని చెప్పారు. డబ్బు కోసం అర్థరాత్రి రోడ్డుపై వెళ్లే వారిని ఆపి దోచుకునేవారు. పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారనే విషయాన్ని పోలీసులు గుర్తించారు.