పదునైన ఆయుధం బాలుడి తలలోకి దూసుకుపోయింది.. నొప్పి లేదు, రక్తం రాలేదు

Sharp weapon penetrated 4 cm inside child's head. మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat
Published on : 19 March 2022 5:58 PM IST

పదునైన ఆయుధం బాలుడి తలలోకి దూసుకుపోయింది.. నొప్పి లేదు, రక్తం రాలేదు

మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. నిద్రిస్తున్న సమయంలో మంచం మీద నుంచి కిందపడిన చిన్నారి తలలోకి పదునైన ఆయుధం రెండు అంగుళాలు లోపలికి వెళ్ళిపోయింది. షాకింగ్ విషయం ఏమిటంటే, అతని తల నుండి రక్తం కారలేదు, అతడికి నొప్పి కూడా లేదు. ఈ ఘటన సాగర్‌లోని డియోరీ ప్రాంతంలో చోటుచేసుకుంది. సునా గ్రామంలో రాత్రి నిద్రిస్తుండగా ఓ చిన్నారి మంచంపై నుంచి కిందపడిపోవడంతో కూరగాయలు కోసేందుకు ఉపయోగించే పదునైన ఆయుధం అతని తలలోకి గుచ్చుకుంది.

ఆ చిన్నారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించడంతో 3 గంటల ఆపరేషన్ అనంతరం ఆ వస్తువును తల నుండి బయటకు తీశారు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే దేవ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు, అక్కడ నుండి జిల్లా ఆసుపత్రికి పంపారు. ఘటన చోటు చేసుకున్న రాత్రి కరెంటు పోయిందని బాధితురాలి సోదరుడు దశరథ్ సేన్ తెలిపారు. 16 ఏళ్ల భూపేంద్ర రాత్రి నిద్రిస్తూ అతను మంచం మీద నుండి పడిపోయాడు. మంచం కింద ఉన్న కొడవలి అతని తలపైకి చొచ్చుకుపోయింది. అతడికి సిటి స్కాన్ చేయగా, తలలో 4 సెంటీమీటర్ల లోపలికి ప్రవేశించినట్లు గుర్తించామని, రోగి పరిస్థితిని చూసి వెంటనే ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లామని న్యూరోసర్జన్ డాక్టర్ కుల్దీప్ సింగ్ తెలిపారు.

అక్కడ 6 మంది వైద్యుల బృందం 3 గంటలపాటు శస్త్రచికిత్స చేసి దాని బయటకు తీశారు. మెదడుకు ఎటువంటి నష్టం కలగలేదని తెలిపారు. పిల్లాడి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ముందుగా అతని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేసి, వెంటనే ఆపరేషన్ ప్రారంభించామని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ తర్వాత అతడు ప్రమాదం నుండి బయటపడ్డాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.











Next Story