వారిది 25 రోజుల ప్రేమే.. వివాహిత ఎంత పని చేసిందంటే..?
ఓ మహిళ తన భర్తను వదిలి ఇద్దరు పిల్లలతో సహా ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ప్రియుడిపై ఇచ్చిన ఫిర్యాదును సదరు మహిళ వెనక్కి తీసుకుంది.
By - Medi Samrat |
ఓ మహిళ తన భర్తను వదిలి ఇద్దరు పిల్లలతో సహా ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ప్రియుడిపై ఇచ్చిన ఫిర్యాదును సదరు మహిళ వెనక్కి తీసుకుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఖుతార్‌లోని ఓ గ్రామానికి చెందిన దంపతులు 25 రోజుల క్రితం లఖింపూర్ ఖేరీలోని సంపూర్ణనగర్ పట్టణానికి చెరుకు ఒలిచే పని కోసం వెళ్లారు. పక్క గ్రామానికి చెందిన ఓ యువకుడు కూడా అక్కడే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ యువతి యువకుడికి మరింత దగ్గరైంది. ఇద్దరూ కలిసి జీవించాలని భావించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యతో గొడవ జరిగింది. అయినా.. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి వెళ్తానని మొండిగా ఉంది. ఈ నేపథ్యంలోనే సహజీవనం కూడా ప్రారంభించింది. భార్యను తీసుకొచ్చేందుకు భర్త ప్రయత్నించాడు. కానీ అది కుదరలేదు.
దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పంచాయితీ జరిగినా ఆ యువతి తన ప్రేమికుడితో కలిసి వెళ్తానని మొండిగా ఉంది. బంధువులు ఎలాగోలా ఆ మహిళను ఇంటికి తీసుకురాగా.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. జనవరి 10న భర్త తన భార్యతో కలిసి ఖుతార్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అతని భార్య తన ప్రేమికుడిని పోలీస్ స్టేషన్‌కు రావాలని కోరగా.. దీనికి యువకుడు రాకుండా వాయిదా వేశాడు. సాయంత్రం వరకు వేచి ఉన్న తర్వాత మహిళ తన ప్రేమికుడిపై ఫిర్యాదు చేసింది. అనంతరం భర్తతో కలిసి ఇంటికి వెళ్లింది. ఆదివారం ఇరువైపులా పంచాయితీ మొదలైంది. భర్త తన భార్యను ఇంటికి వెళ్దామని కోరుతూనే ఉన్నాడు.. అయినప్పటికీ ఆమె వినలేదు. మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకుని ప్రేమికుడితో కలిసి వెళ్లిపోయింది. ఆ మహిళ తన నాలుగు, ఆరేళ్ల కుమార్తెలను కూడా వెంట తీసుకెళ్లింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడం లేదని.. వాపస్ తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ శ్యామ్‌వీర్ సింగ్ తెలిపారు.