ఖాళీగా ఉన్న గదిలోకి తీసుకెళ్లి.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. అది కూడా ఓ పెళ్లి వేడుకలో..

Sexual assault with a six year old girl in delhi. దేశ రాజధాని ఢిల్లీలో ఓ అమాయక బాలికపై జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. కమ్యూనిటీ భవనంలోని ఓ గదిలో ఈ ఘటన

By అంజి  Published on  22 Dec 2021 11:45 AM IST
ఖాళీగా ఉన్న గదిలోకి తీసుకెళ్లి.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. అది కూడా ఓ పెళ్లి వేడుకలో..

దేశ రాజధాని ఢిల్లీలో ఓ అమాయక బాలికపై జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. కమ్యూనిటీ భవనంలోని ఓ గదిలో ఈ ఘటన జరిగింది. గదిలో రక్తపుమడుగులో పడి ఉన్న బాలికను బంధువులు ఆస్పత్రిలో చేర్పించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. తల్లిదండ్రులతో కలసి వివాహ వేడుకకు వచ్చిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉదంతం సెంట్రల్ ఢిల్లీలోని రంజిత్ నగర్ ప్రాంతంలో వెలుగు చూసింది. పెళ్లికి హాజరైన ఓ వ్యక్తి పుస్తకం కాపీ ఇస్తానని చెప్పి బాలికను కమ్యూనిటీ భవనంలోని నిర్జన గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లైంగిక దాడి చేసి పరారయ్యాడు.

బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఇంతలో ఆ బాలిక గదిలో రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో పూసా రోడ్డుకు చెందిన నరేష్‌కుమార్‌(28) అనే నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. పోక్సో, అత్యాచారం తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

సమాచారం ప్రకారం.. రంజిత్ నగర్ ప్రాంతంలో బాలిక కుటుంబం నివసిస్తోంది. ఆదివారం బాలిక కుటుంబం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్‌కు వెళ్లారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు భోజనం చేస్తుండగా.. బాలిక అక్కడ ఆడుకోవడం ప్రారంభించింది. అదే పెళ్లి వేడుకలో ఉన్న నిందితుడి కన్ను బాలికపై పడింది. బాలికను ప్రలోభపెట్టి ఓ గదిలోకి తీసుకెళ్లి నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story