చిన్నారులపై లైంగిక దాడులు ఆగడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లా బి. కొత్తకోట లోని ఇందిరమ్మ కాలనీలో ఇద్దరు చిన్నారులపై ఓ యువ‌కుడు లైంగిక దాడికి పాల్పడిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. అనిల్(20) అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారులను మిద్దెపైకి తీసుకెళ్లి లైంగికదాడికి య‌త్నించాడు. చిన్నారులు కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.

చిన్నారులు ఇందిరమ్మ కాలనీలోని అమ్మమ్మ వద్ద ఉంటున్న క్ర‌మంలో.. కొద్దిరోజులుగా యువ‌కుడు వారిని వేధిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఘ‌ట‌న‌పై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.సామ్రాట్

Next Story