మసాజ్ పార్లర్‌లో మహిళా సిబ్బందిపై దాడి.. లైంగిక దాడికి యత్నించడంతో..
sexual assault attempt on female staff in Kochi massage parlour. కేరళలోని కొచ్చిలోని ఓ ఆయుర్వేద మసాజ్ సెంటర్‌లో పనిచేస్తున్న ఓ మహిళ..
By Medi Samrat Published on 28 Jan 2022 1:21 PM GMT
కేరళలోని కొచ్చిలోని ఓ ఆయుర్వేద మసాజ్ సెంటర్‌లో పనిచేస్తున్న ఓ మహిళ.. తన సహోద్యోగిపై అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు ప్రయత్నించాడంటూ ఫిర్యాదు చేసింది. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా ఆమె ఫిర్యాదులో పొందుపరిచారు. తగిన ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసులు అతడిని అరెస్ట్ చేయలేదని ఆ మహిళ ఆరోపించింది. నిందితుడు అజిత్ నారాయణన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. గత సోమవారం పార్లర్‌కు వచ్చిన కస్టమర్ సర్వీస్ గురించి ఫిర్యాదు చేయడంతో.. అజిత్, మహిళ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అజిత్ బాధితురాలిని చెంపదెబ్బ కొట్టి లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడు.
ఈ సంఘటన తర్వాత, మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అందులో దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా ఉంది. జనవరి 8న ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అజిత్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. డబ్బులు అడిగాడని బాధిత ఆమె ఆరోపించింది. యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా అజిత్‌పై సరైన చర్యలు తీసుకోలేదని బాధితురాలు వాపోయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎర్నాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అజిత్ నారాయణన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.