8-12 ఏళ్ల అబ్బాయిలపై లైంగిక వేధింపులు.. అసభ్యకరమైన వీడియోలు తీసి..

Sexual abuse of 8-12 year old boys in Pakistan. గత కొంతకాలంగా పాకిస్థాన్‌లో నేరాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మైనర్ బాలురపై లైంగిక వేధింపులకు పాల్పడిన షాకింగ్ కేసు

By అంజి  Published on  21 Feb 2022 10:57 AM IST
8-12 ఏళ్ల అబ్బాయిలపై లైంగిక వేధింపులు.. అసభ్యకరమైన వీడియోలు తీసి..

గత కొంతకాలంగా పాకిస్థాన్‌లో నేరాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మైనర్ బాలురపై లైంగిక వేధింపులకు పాల్పడిన షాకింగ్ కేసు తెరపైకి వచ్చింది. ఇందులో నలుగురిని అరెస్టు చేశారు. తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లోని ఓ ఇంట్లో మైనర్‌లపై లైంగిక వేధింపులకు పాల్పడి వారితో అసభ్యకరమైన వీడియోలు తీసినందుకు పాకిస్థాన్ పోలీసులు ఈ అరెస్టులు చేశారు. కాగా ముఠాలోని ఇతర సభ్యుల కోసం గాలిస్తున్నారు. ఈ ముఠాకు చెందిన నలుగురు అనుమానితులను శుక్రవారం అర్థరాత్రి సహివాల్ జిల్లా నుంచి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఉమర్ దరాజ్ తెలిపారు. వారిని శనివారం కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుండి వారందరినీ నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. మొబైల్ ఫోన్లు, యూఎస్‌బీ డ్రైవ్‌ల నుండి 46 అశ్లీల వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, నిందితులు 8 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల అబ్బాయిలను వేధింపులకు గురిచేశారని దారాజ్ చెప్పారు.

నిందితులు చిన్నారులకు ఎర వేసేవారు

ముఠాలోని ఒక సభ్యుడు నగరంలోని ప్రధాన బస్‌ టెర్మినల్‌లో విక్రయదారుడని, ఇళ్ల నుంచి పారిపోయే లేదా భిక్షాటన చేసే పిల్లలను ఆకర్షించేవాడని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు అధికారి తెలిపారు. ఈ నేరంలో ఎక్కువ మంది ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు చూపుతున్నాయి. దేశంలో పిల్లలు, మహిళలను నిరంతరం లక్ష్యంగా చేస్తుకుంటున్నారు. ఇటీవల ఓ మహిళపై అత్యాచారం, హత్య కేసులో ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్దఎత్తున నిరసనలు తెలిపారు.

మొదట ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు

ఈ సంవత్సరం ప్రారంభంలో ఫెడరల్ ఇన్వెస్టిగేటర్లు అంతర్జాతీయ చైల్డ్ పోర్నోగ్రఫీతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ కేసు దర్యాప్తులో ఒకరు చిన్నారుల అశ్లీల వీడియోలను డార్క్ వెబ్‌లో పెట్టేవారని తేలింది. డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్‌లో ఒక భాగం, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా మాత్రమే దీన్ని యాక్సెస్ చేయవచ్చు. డార్క్ వెబ్‌లో ఆయుధాలు, డ్రగ్స్, మానవ అక్రమ రవాణా జరుగుతాయి.

Next Story