కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదా ఏడుగురు నిండు ప్రాణాలను బలితీసుకుంది. వివరాళ్లోకెళితే.. సిద్ధవటం లోనీ పెన్నానదిలో ఈత కొట్టేందుకు ఏడుగురు యువకులు వెళ్లారు. ప్రమాదవశాత్తు పెన్నా నదిలోపడి దుర్మరణం పాలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. యువకుల మృతదేహాల కోసం గాలింపుచర్యలు చేపట్టారు.
తిరుపతికి చెందిన 8 మంది యువకులు.. సిద్ధవటంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం నదిలో ఈతకు వెళ్లి.. ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన యువకులను తిరుపతికి చెందిన ఇరుపూరి శంకర(20), రాజేష్ (19), జగదీష్ (20), యాష్ (22), సతీష్ (20), నాని (20), తరుణ్ (20)లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఇప్పటివరకు ఇద్దరు యువకుల మృతదేహాలు వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ఐదుగురి కోసం గజఈతగాళ్లు గాలింపు కొనసాగిస్తున్నారు.