ఘోర విషాదం : బిల్డింగ్ పైకప్పు కూలి ఏడుగురు మృతి
Seven dead after building collapses in Ulhasnagar. మహారాష్ట్రలోని థానేలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్ పైకప్పు కూలి
By Medi Samrat Published on
29 May 2021 7:31 AM GMT

మహారాష్ట్రలోని థానేలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్ పైకప్పు కూలి ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో కొంతమంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వివరాళ్లోకెళితే.. థానేలో ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో నెహ్రూ చౌక్ వద్ద ఉన్న ఓ భవనం ఐదో అంతస్థు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపకశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ విషయమై థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు భవనం శిథిలాల నుంచి ఏడు మృతదేహాలు వెలికి తీసినట్లు.. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని.. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నది తెలియాల్సివుందని అధికారులు తెలిపారు.
Next Story