ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలపై అత్యాచారం.. తాంత్రికుడు అరెస్టు

Self-styled godman held for raping three women of same family in UP's Gorakhpur. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలపై అత్యాచారం

By Medi Samrat
Published on : 2 Sept 2022 8:30 PM IST

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలపై అత్యాచారం.. తాంత్రికుడు అరెస్టు

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలపై అత్యాచారం చేసి.. రూ.60,000 మోసం చేసిన ఓ తాంత్రికుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాంపియర్‌గంజ్ గ్రామంలో నివసిస్తున్న ఓ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు ఇటీవల మరణించడంతో ఆ కుటుంబంలోని మహిళల్లో చాలా భయం పట్టుకుంది. ఆ సమయంలో వారు శ్యామ్ బిహారీ అనే తాంత్రికుడి సహాయం కోరారు. భూతవైద్యం పేరుతో రాత్రిపూట బాధితులను పిలిచి మత్తు మందు తినిపించి పలుమార్లు అత్యాచారం చేశాడు.

వారి కుటుంబంపై ఉన్న శాపాన్ని తొలగించేందుకు రూ.60 వేలు ఖర్చు కూడా అవుతుందని వెల్లడించాడు. అతడు చెప్పినట్లే ఆ కుటుంబం ఆ తాంత్రికుడికి డబ్బు ఇవ్వడం మొదలుపెట్టారు. అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న కారణంగా, బాధితులు తమ కుటుంబ సభ్యులెవరికీ ఈ సంఘటనను వెల్లడించలేదు. ఇటీవలి కాలంలో ఈ విషయం గురించి మహిళలు మాట్లాడుకోవడంతో పోలీసులను సంప్రదించారు. బాధితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు గోరఖ్‌పూర్ ఎస్పీ నార్త్ మనోజ్ అవస్తీ తెలిపారు. అతడిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.


Next Story