అనాథశ్రమంలో బాలికపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం.. గర్బందాల్చిన బాలిక
Security guard at shelter home rapes teen girl in Delhi. దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. అనాథాశ్రమంలో ఉంటున్న ఓ బాలికపై కన్నేసిన సెక్యూరిటీ గార్డు..
By అంజి Published on
6 Feb 2022 2:39 AM GMT

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. అనాథాశ్రమంలో ఉంటున్న ఓ బాలికపై కన్నేసిన సెక్యూరిటీ గార్డు.. ఆమెను లోబర్చుకున్నాడు. 16 ఏళ్ల మేధో వికలాంగ బాలికపై షెల్టర్ హోమ్‌లోని సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు. కడుపునొప్పితో బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత షెల్టర్‌హోమ్ మేనేజర్ జనవరి 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేర్ సెంటర్‌లోని ఓ బాలిక కడుపునొప్పితో బాధపడుతోందని, ఆమెను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని చెప్పారు.
ఆమె గర్భవతి అని వైద్యులు తెలిపారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. షెల్టర్ హోంలో ఉంచిన గార్డుపై బాధితురాలు ఆరోపణలు చేసింది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించిన ఒక రిపోర్టు ప్రకారం.. నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు వారిలో ఇంకా ఎవరినైనా లక్ష్యంగా చేసుకున్నారా అని నిర్ధారించడానికి పోలీసులు ఇంట్లో ఉన్న ఇతర బాలికలతో మాట్లాడుతున్నారు. బాలికను మూడేళ్ల క్రితం తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి ఆశ్రమంలో ఉంటోంది. ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
Next Story