ఈ-రిక్షాను ఢీకొట్టిన స్కూటీ.. గొడ‌వ‌లో ఒక‌రు మృతి

వాగ్వాదం కాస్తా ప్రాణాలు పోయే స్థాయికి చేరింది. 36 ఏళ్ల వ్యక్తిని ఈ-రిక్షా డ్రైవర్, మరో ఇద్దరు కొట్టి చంపినట్లు జైపూర్ పోలీసులు తెలిపారు

By Medi Samrat  Published on  17 Aug 2024 9:15 PM IST
ఈ-రిక్షాను ఢీకొట్టిన స్కూటీ.. గొడ‌వ‌లో ఒక‌రు మృతి

వాగ్వాదం కాస్తా ప్రాణాలు పోయే స్థాయికి చేరింది. 36 ఏళ్ల వ్యక్తిని ఈ-రిక్షా డ్రైవర్, మరో ఇద్దరు కొట్టి చంపినట్లు జైపూర్ పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి స్వామి బస్తీకి చెందిన దినేష్ స్వామి, జితేంద్ర స్వామి స్కూటీలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. శాస్త్రి నగర్ ప్రాంతంలో వారి స్కూటీ ఈ-రిక్షాను ఢీకొట్టింది. దీంతో దినేష్, రిక్షా డ్రైవర్ మధ్య గొడవకు దారితీసిందని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్-II) బజరంగ్ సింగ్ తెలిపారు.

ఘటన అనంతరం ఇద్దరూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారని, అయితే ఇంటికి చేరిన తర్వాత దినేష్ పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందాడని తెలిపారు. ఈ-రిక్షాలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని.. వారిలో ఒకరిని షారుక్‌గా గుర్తించామని, మరో ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వేగంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించారు.

Next Story