20 మంది టూరిస్టులు మృతి
school bus in Himachal Pradesh's Kullu falls in gorge. హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 4 July 2022 5:57 AM GMT
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే మరణించారు. పాఠశాల విద్యార్థులతో సహా ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. కులు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం సైంజ్ ప్రాంతానికి ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదానికి వర్షాలు, మితిమీరిన వేగం కారణమని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. కులు డిప్యూటీ కమీషనర్ అశుతోష్ గార్గ్ మాట్లాడుతూ, "ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సైంజ్ వెళ్తున్న బస్సు జంగ్లా గ్రామ సమీపంలోని లోయలో పడిపోయింది. జిల్లా అధికారులు, రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నాము" అని తెలిపారు.