ఈ ఫోటోలో దొంగతనం చేయబడ్డ వస్తువు ఏమిటో తెలుసా..?

SBI ATM looted in Nagaon's Raha. ఈ ఫోటోను గమనించారా..? ఇందులో ఉన్న వస్తువు ఏమిటో మీకు ఓ ఐడియా వచ్చిందా..?

By Medi Samrat  Published on  10 Jan 2022 8:05 AM GMT
ఈ ఫోటోలో దొంగతనం చేయబడ్డ వస్తువు ఏమిటో తెలుసా..?

ఈ ఫోటోను గమనించారా..? ఇందులో ఉన్న వస్తువు ఏమిటో మీకు ఓ ఐడియా వచ్చిందా..? ఎందుకంటే ఇది ఏటీఎం మెషీన్. ఇటీవలి రోజుల్లో ఏటీఎం దోపిడీలు సర్వసాధారణంగా మారాయి. సోమవారం నాగావ్‌లోని రాహాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ను దోచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసు సూపరింటెండెంట్ ఆనంద్ మిశ్రా మాట్లాడుతూ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, తెల్లవారుజామున 3:30 గంటలకు దోపిడీ జరిగింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలో ఆధారాల కోసం వెతుకుతున్నారు. ఈ దొంగతనం చేసిన నేరస్థులను వెంటనే అరెస్టు చేస్తారు. గ్యాస్ కట్టర్లతో యంత్రాలను దోచుకున్నారని పోలీసులు తెలిపారు. ఎంత మొత్తం దోచుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.

స్థానికుల కథనం ప్రకారం, దొంగలు మొత్తం మూడు యంత్రాలను దోచుకున్నారని, ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారని తెలిపారు. బొంగైగావ్‌లోని బర్పరాలో గత వారం గుర్తుతెలియని వ్యక్తులు రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATMలను దొంగిలించారు. అందులో నుండి రూ. 40 లక్షలకు పైగా దొంగిలించారు. ఐదు నుండి ఆరు మంది వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దొంగతనానికి ముందు సదరు వ్యక్తులు సీసీటీవీ వైర్లను అన్‌ప్లగ్ చేశారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లోని ఏటీఎం మానిటరింగ్ బృందం ట్యాంపరింగ్ గురించి పోలీసులను అప్రమత్తం చేసింది. అధికారులు వచ్చేసరికి దుండగులు డబ్బుతో పరారైనట్లు పోలీసులు తెలిపారు.


Next Story