విశాఖ జిల్లాలో సంచలనం సృష్టించిన మధురవాడ మారికావలస చిన్నారి సంధ్య శ్రీ కేసులో చిక్కుముడి వీడింది. ప్రియుడే హంతకుడుగా తేల్చారు పీఎంపాలెం పోలీసులు. వివాహేతర సంబంధమే చిన్నారి హత్యకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. భర్తతో విడిపోయిన భార్య తన వివాహేతర సంబంధానికి కూతురు అడ్డుగా ఉందని కన్నకూతురినే కడతేర్చింది.
పక్కా ప్లాన్‌తో ప్రియుడితో కలిసి కూతురు సంధ్య శ్రీని చంపేసి.. అర్ధరాత్రి స్మశానవాటికలో గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేశారు హంతకులు. చిన్నారి సంధ్యశ్రీ హత్య విషయం సంచలనం రేపింది. రంగంలోకి దిగిన పీఎంపాలెం పోలీసులు హత్య కేసు నమోదుచేశారు. కేవలం 30 గంటల్లో కేసును ఛేదించారు. పోలీసుల విచారణలో నిందితుడు జగదీష్ ఒళ్లు గగుర్పొడిచే విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది.