తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు.. ఎనిమిది మంది మృతి
Road accidents in telugu states.తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం రహదారులు నెత్తురోడాయి.
By తోట వంశీ కుమార్ Published on 23 March 2021 10:01 AM IST
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం రహదారులు నెత్తురోడాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగగా..ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో సంగం మండలం దువ్వూరు వద్ద కూలీలతో వెలుతున్న మినీ ట్రక్కును పాల వ్యాను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కొడవలూరు మండలం రాజుపాలెం చెరువుల్లో చేపలు పట్టడం కోసం వెళ్లేందుకు 14 మంది ఆటో ఎక్కుతుండగా.. వెనకవైపు నుంచి వచ్చిన పాల వ్యాను ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలో కొనడంతో దువ్వూరు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కిడిక్కడే దుర్మణం చెందగా.. నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
వీరితో పాటు పాల వ్యాను డ్రైవర్‌తో సహా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను బుచ్చిరెడ్డి పాలెం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతిచెందిన వారిని దువ్వూరు గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన బాబు(55), రమణయ్య(60), మాలకొండయ్య(50), జి.శ్రీనయ్య(50), ఎం.శ్రీనయ్యగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
అంబర్‌పేట వద్ద ఔటర్ రింగ్‌రోడ్‌పై ..
లారీని కారు ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద ఔటర్ రింగ్‌రోడ్‌పై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ముందు భాగం నుజ్జునుజ్జయింది. మృతదేహాలు అందులో ఇరుకుపోయగా.. వాటిని పోలీసులు వెలికితీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమదానికి, మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.