డివైడ‌ర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

Road Accident in Tirupati two dead.తిరుప‌తిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం ఉద‌యం ఓ కారు అదుపు త‌ప్పి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 July 2022 11:03 AM IST
డివైడ‌ర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

తిరుప‌తిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం ఉద‌యం ఓ కారు అదుపు త‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈఘ‌ట‌న సి.మ‌ల్ల‌వ‌రం స‌మీపంలో చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం రుయా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను త‌మిళ‌నాడు రాష్ట్రం ఈరోడ్డుకు చెందిన శ‌ర‌ణ్య‌(30), మిథున్‌(12)గా గుర్తించారు.

ఒకే కుటుంబానికి ఐదుగురు కారులో తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు వెలుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో త‌ల్లి, కొడుకు మృతి చెందిన‌ట్లు పోలీసులు తెలిపారు. క్ష‌త‌గాత్రుల్లో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు చెప్పారు. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తే ప్ర‌మాదానికి కార‌ణంగా పోలీసులు భావిస్తున్నారు.

Next Story