పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాచేపల్లిలో లారీని ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఆగివున్న లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో పది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కందుకూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో దాచేపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడని తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స కోసం గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో పది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడివారిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.