నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. జిల్లా కేంద్రంలోని కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటక 2 గంటల సమయంలో

By Medi Samrat  Published on  10 Feb 2024 8:44 AM IST
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.

ప్రైవేట్‌ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో కొంతమంది ఇరుక్కుపోయారని.. వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Next Story