కావలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Road accident in Kavali, Nellore district .. Three killed. ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు

By అంజి  Published on  8 Dec 2021 11:08 AM IST
కావలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. బుధవారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా రుద్రకోట శివారులో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే సదరు వ్యక్తి మృతి చెందాడు. మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్‌ అతి వేగమా లేదంటే నిద్ర మత్తులో ఉన్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ నగరంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు గాయపడ్డారు. పంజాగుట్టలో ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. పఠాన్‌చెరు శివారులోని ఔటర్‌రింగ్‌ రోడ్డుపై అదుపు తప్పిన కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు.

Next Story