కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. హిందూపురానికి చెందిన నలుగురు వ్యక్తులు బొరెలో వాహనంలో కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా షహర్‌పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వంతెన గోడను వాహనం బలంగా ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు స్పాట్‌లోనే చనిపోయారు. మృతులందరూ హిందూపురానికి చెందిన నాగరాజు, సోమ, నాగభూషణ్, మురళిగా గుర్తించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితులు యాద్గిర్ జిల్లాలోని షాపూర్ వైపు గొర్రెలను కొనుగోలు చేయడానికి బొలెరో పికప్ వాహనంలో వెళుతుండగా, డ్రైవర్ నియంత్రణ కోల్పోయి అమరాపుర క్రాస్ సమీపంలోని వంతెనను ఢీకొట్టాడు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలో కోల్పోయారు. డ్రైవర్ ఆనంద్ గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు..అని పోలీసులు తెలిపారు.