క‌ర్ణాట‌క‌లో రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు హైద‌రాబాద్ వాసులు దుర్మ‌ర‌ణం

Road Accident in Karnataka four hyderabadi people dead.క‌ర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2023 7:10 PM IST
క‌ర్ణాట‌క‌లో రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు హైద‌రాబాద్ వాసులు దుర్మ‌ర‌ణం

క‌ర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో హైద‌రాబాద్‌కు చెందిన న‌లుగురు దుర్మ‌ర‌ణం చెందారు. మృతుల్లో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉన్నారు.

టీఎస్ 29పి3693 కారులో హైదరాబాద్‌కు చెందిన న‌లుగురు విహార యాత్ర‌కు వెలుతుండ‌గా క‌ర్ణాట‌క‌లోని కొప్ప‌ల జిల్లా బ‌డ్నేకుప్ప వ‌ద్ద మ‌రో వాహ‌నం వీరు ప్ర‌యాణిస్తున్న కారును ఢీ కొట్టింది. ప్ర‌మాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జ అయ్యింది. ప్ర‌మాద స్థ‌లంలోనే కారులో ప్ర‌యాణిస్తున్న న‌లుగురు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

మృతుల‌ను హైద‌రాబాద్‌కు చెందిన రూపావతి, వర్ధిని, షణ్ముఖ, విక్రమ్ గా గుర్తించారు. మృతుల బంధువుల‌కు స‌మాచారం అందించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా.. ఈ న‌లుగురు ప్ర‌కాశం జిల్లాకు చెందిన వారు కాగా హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ్డారు.

Next Story