మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు డ్రైవర్ అతివేగానికి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేడిపల్లి పీఎస్‌కు సమీపంలో అర్ధరాత్రి పిల్లర్ నెం. 97 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోడుప్పల్ నుండి ఐటీ పోచారం వైపు 8 మందితో ప్రయాణిస్తున్న కారు (టీఎస్ 32 జి 1888) అతివేగంగా పిల్లర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థులు సాయి వరుణ్, నిఖిల్ మృతిచెందగా.. వెంకట్, రాకేష్, యశ్వంత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు విద్యార్థులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వీరంతా వనపర్తి జిల్లాకు చెందినవారిగా సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.