అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం
Road accident in Anantapur district, 8 people were killed. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు.
By అంజి Published on
6 Feb 2022 2:16 PM GMT

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన జిల్లా పరిధిలోని ఉరవకొండ మండలం బూదగవి దగ్గర జరిగింది. ఇన్నోవాను అతి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరకున్నారు. ఓ పెళ్లి వేడుకకు హాజరై బళ్లారి నుండి అనంతపురం తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ధాటికి కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. మృతులను ఉరవకొండ మండలంలోని నమ్మగల్లు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. తమ వారు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో ముగినిపోయారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story