త్రికోణ ప్రేమ కథ.. ముగ్గురి ప్రాణాలు పోయాయి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో పిస్టల్‌తో ఓ వ్యక్తి.. మహిళను, ఆమె స్నేహితుడిని కాల్చి చంపాడు.

By Medi Samrat  Published on  6 April 2024 6:36 PM IST
త్రికోణ ప్రేమ కథ.. ముగ్గురి ప్రాణాలు పోయాయి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో పిస్టల్‌తో ఓ వ్యక్తి.. మహిళను, ఆమె స్నేహితుడిని కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు కూడా కాల్చుకుని చనిపోయాడు. మొత్తం మూడు ప్రాణాలు పోడానికి ప్రేమ వ్యవహారమేనని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. నిందితుడు మహిళతో గొడవపడి, ఆమె స్నేహితుడిని కూడా కాల్చి చంపేశాడు.. ఆపై అదే తుపాకీతో ఆత్మహత్య చేసుకున్నాడు.

అభిషేక్ యాదవ్ (26) అనే వ్యక్తి కంట్రీ మేడ్ పిస్టల్‌తో యువతి స్నేహలతా జాట్ (22) ను.. ఆమె స్నేహితుడు దీపక్ జాట్ (25)లను ఖాండ్వా రోడ్‌లోని స్వామినారాయణ టెంపుల్ కాంప్లెక్స్ వద్ద కాల్చి చంపాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) హృషికేశ్ మీనా తెలిపారు. ఆ తర్వాత అదే పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఈ విషాద సంఘటనకు కారణం ముక్కోణపు ప్రేమ వ్యవహారం అనిపిస్తోందని.. అయితే హత్యలకు ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాకు చెందినవాడని అధికారులు తెలిపారు.

“రెండేళ్ల క్రితం అభిషేక్ యాదవ్, స్నేహలత స్నేహంగా మెలిగారు. ఇటీవలి కాలంలో స్నేహలత నిందితుడి నుండి దూరం పాటించడం ప్రారంభించింది. ఇది అతనికి చాలా కోపం తెప్పించింది” అని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనంద్ యాదవ్ అన్నారు. నిందితుడు ముందుగా దీపక్ జాట్ పై రెండు బుల్లెట్లు పేల్చారు. ఆ తర్వాత స్నేహలతా జాట్ ను పట్టుకుని రెండు బుల్లెట్లను దించాడు. ఇద్దరినీ హతమార్చిన తర్వాత, అభిషేక్ యాదవ్ చివరకు ఒక ప్రైవేట్ కళాశాల ఆవరణలోకి ప్రవేశించాడు. అక్కడ అతను తనను తాను కాల్చుకుని చనిపోయాడు.

Next Story