జార్ఖండ్‌లోని రాంచీలో ఓ మోడల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాల వ్యాపారంలో ఆ మోడల్ కు లింకులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మోడల్‌తో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఆమె డ్రగ్స్ వ్యాపారం సాగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న మోడల్ పేరు జ్యోతి అని అంటున్నారు. రాంచీలోని సుఖ్‌దేవ్ నగర్ పోలీసులు మాదకద్రవ్యాల వ్యాపారంలో భాగమైన ఒక మహిళా మోడల్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. రాంచీలోని సుఖ్ దేవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న డ్రగ్స్ వ్యాపారంపై గత కొద్దిరోజులుగా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. పోలీసు బృందం ఒక మోడల్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది, అయితే ముఠా నాయకుడు పోలీసులను తప్పించుకుని పారిపోయాడు.
పోలీసులు అరెస్ట్ చేసిన మోడల్ జ్యోతి భరద్వాజ్ అని తెలుస్తోంది. అరెస్టయిన మోడల్ గత రెండున్నరేళ్లుగా ఢిల్లీలో ఉంటూ ప్రస్తుతానికి రాంచీకి వచ్చి డ్రగ్స్ స్మగ్లర్ తో పరిచయం ఏర్పరచుకుంది. అప్పటి నుండి ఈ అక్రమ వ్యాపారంలో పాల్గొంది. మోడల్ డ్రగ్స్ సరఫరా చేయడానికి ఏజెంట్లను నియమించిందని చెబుతున్నారు. యువతను డ్రగ్స్ బానిసలుగా చేయడానికి తన వలపు వలను విసిరేదని ఆరోపణలు ఉన్నాయి. ఆమె ప్రేమ ఉచ్చులో చిక్కుకున్న వారితో అక్రమంగా డ్రగ్స్ వ్యాపారం చేయించేదని తెలుస్తోంది. జ్యోతి భరద్వాజ్‌ను అరెస్టు చేసిన సమయంలో ఆమె నుంచి 28 గ్రాముల బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నారు.