కల్వర్టును ఢీకొట్టిన‌ బస్సు.. 10 మంది మృతి, 36 మందికి గాయాలు

రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం బస్సు ఫ్లైఓవర్ గోడను ఢీకొనడంతో పది మంది మృతి చెందగా.. 36 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు

By Medi Samrat  Published on  29 Oct 2024 6:10 PM IST
కల్వర్టును ఢీకొట్టిన‌ బస్సు.. 10 మంది మృతి, 36 మందికి గాయాలు

రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం బస్సు ఫ్లైఓవర్ గోడను ఢీకొనడంతో పది మంది మృతి చెందగా.. 36 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్ర‌మాదంపై పోలీసులు ఈ సమాచారం ఇచ్చారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ భువన్ భూషణ్ యాదవ్ మాట్లాడుతూ.. సలాసర్ నుండి లక్ష్మణ్‌గఢ్‌కు వస్తున్న ప్రైవేట్ బస్సు టర్న్ తీసుకుంటుండగా లక్ష్మణ్‌గఢ్‌లోని ఫ్లైఓవర్‌లోని కొంత భాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా.. 36 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లక్ష్మణ్‌గఢ్‌, సికార్‌లోని ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన తెలిపారు.


Next Story