బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిపై అత్యాచారయత్నం.. ప్ర‌తిఘ‌టించ‌డంతో..

Punjab girl pushed off from roof for resisting rape. ఆగస్టు 17న పంజాబ్‌లోని మోగాలోని గోధేవాలా స్టేడియంలో ఓ వ్యక్తి తన ఇద్దరు

By Medi Samrat  Published on  20 Aug 2022 10:24 AM GMT
బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిపై అత్యాచారయత్నం.. ప్ర‌తిఘ‌టించ‌డంతో..

ఆగస్టు 17న పంజాబ్‌లోని మోగాలోని గోధేవాలా స్టేడియంలో ఓ వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ యువతిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో పైకప్పు పైనుంచి తోసేశారు. ఈ ఘటనలో బాలికకు గాయాలయ్యాయి. ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, వారిని పట్టుకునేందుకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు మాట్లాడుతూ.. "అమ్మాయి తండ్రి వాంగ్మూలం ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఆమె స్నేహితుడు జతిన్ కందా ఆమెను స్టేడియంకు పిలిపించాడు.. అతని ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెతో గొడవకు దిగారు. వారు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించగా.. వారు ఆమెను తోసేశారు." అని చెప్పుకొచ్చారు.

ఆ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిపై ముగ్గురు యువకులు చేసిన అత్యాచార యత్నాన్ని ప్రతిఘటించడంతో స్టేడియం పైకప్పు నుండి తోసివేయబడింది. దీంతో ఆమెకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సంఘటన 12 ఆగస్టు 2022న జరిగింది. 18 ఏళ్ల బాలిక రెండు కాళ్లకు, దవడకు గాయాలవ్వడంతో చికిత్స కోసం లూథియానాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.

అనుమానితుల్లో ఒకరైన జతిన్ కందా స్టేడియంలో ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు మోపారు. ఆమె పోరాడి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు అతను ఆమెను సుమారు 25 అడుగుల ఎత్తు పైనుండి తోసేశాడు, ఆమె తీవ్రంగా గాయపడింది. జతిన్, అతని ఇద్దరు సహచరులపై భారతీయ శిక్షాస్మృతిలోని 307 (హత్య ప్రయత్నం) మరియు 376 (అత్యాచారం) సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. పంజాబ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఫిబ్రవరి 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత భగవంత్ మాన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మే 2022లో, పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఒక రోజు తర్వాత హత్య చేశారు.


Next Story