టెస్ట్ డ్రైవ్ చేస్తానని కార్ తీసుకుని వెళ్ళాడు.. 100 రోజుల తర్వాత దొరికాడు

Pretending to take car for test drive. టెస్ట్ డ్రైవ్ చేస్తామని చెప్పి.. ఇంజనీర్‌కు చెందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ కారుని దొంగిలించిన 36 ఏళ్ల వ్యాపారవేత్తను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  16 May 2022 11:11 AM GMT
టెస్ట్ డ్రైవ్ చేస్తానని కార్ తీసుకుని వెళ్ళాడు.. 100 రోజుల తర్వాత దొరికాడు

టెస్ట్ డ్రైవ్ చేస్తామని చెప్పి.. ఇంజనీర్‌కు చెందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ కారుని దొంగిలించిన 36 ఏళ్ల వ్యాపారవేత్తను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 30న దొంగతనం జరగగా, ఎట్టకేలకు మే 10న పోలీసులు అతడిని పట్టుకున్నారు. హైదరాబాద్ నగరంలోని అమృతనగర్‌కు చెందిన ఎంజి వెంకటేష్ నాయక్, కాఫీ బోర్డు లేఅవుట్‌లో నివాసముంటున్న రవీంద్ర ఎల్లూరి (47)కి చెందిన మారుతీ విటారా బ్రెజ్జాను దొంగిలించిన కేసులో అరెస్టు చేశారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ OLX అందించిన 2,500 ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP) చిరునామాలను ధృవీకరించిన తర్వాత బెంగళూరు పోలీసులు ఆ వ్యక్తిని ట్రాక్ చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.

రవీంద్ర ఎల్లూరి (47) తన మారుతి విటారా బ్రెజ్జా కారును విక్రయించనున్నట్టు ఓఎల్ఎక్స్ లో యాడ్ పెట్టాడు. చిక్కబళ్లాపుర, అమృత్ నగర్ నివాసి ఎంజీ వెంకటేశ్ నాయక్ వెళ్లి రవీంద్ర ఎల్లూరిని కలిశాడు. టెస్ట్ డ్రైవ్ చేస్తానంటే కీ ఇచ్చాడు. ఇంజన్ స్టార్ట్ చేసిన నాయక్ తిరిగి రాకుండా అదృశమయ్యాడు. దీంతో మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు ఓఎల్ఎక్స్ టీమ్ ఇచ్చిన 2,500 ఐపీ చిరునామాలను పరిశీలించారు. చివరికి మే 10న అతడ్ని గుర్తించారు. నేరాన్ని నిందితుడు అంగీకరించాడు. తన భార్య గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయడంతో చాలా డబ్బును 2020 డిసెంబర్ లో నష్టపోయినట్టు అతడు చెప్పాడు. అప్పులు తీర్చేందుకు తన విటారా బ్రెజ్జాను విక్రయించాడు.

డిసెంబర్ 2020 గ్రామ పంచాయితీ ఎన్నికలలో తన భార్య ఓడిపోవడంతో అతను తన స్వంత విటారా బ్రెజాను విక్రయించాడు. "అతను తన స్నేహితుల వద్ద అప్పుగా తీసుకుని ఎన్నికల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. కొన్ని అప్పులు తీర్చేందుకు తన కారును అమ్మేశాడు. కారు లేకుండా తన గ్రామానికి వెళ్లడం అవమానంగా భావించాడు" అని పోలీసులు తెలిపారు. "బాగేపల్లి సమీపంలోని తన గ్రామాన్ని తన కారులో ఎప్పుడూ సందర్శించేవాడు. అది లేకుండా వెళ్లడం అవమానకరమని అతను భావించాడు. యాడ్ చూసి కారు దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు" అని పోలీసు అధికారి తెలిపారు. దొంగిలించిన తర్వాత కారు నంబర్‌ ప్లేట్‌ మార్చాడు. అతడిని స్థానిక కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.













Next Story