బావిలో శవాలుగా ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు.. ఎన్ని కష్టాలో..
Pregnant Women Kids Murdered dowry demand bodies in well. జైపూర్ జిల్లా డూడు పట్టణంలోని ఓ బావిలో శనివారం ముగ్గురు మహిళలు,
By Medi Samrat
జైపూర్ జిల్లా డూడు పట్టణంలోని ఓ బావిలో శనివారం ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. హత్యకు గురైన మహిళలను తోబుట్టువులని తెలిసింది. కలు దేవి, మమత, కమలేష్ లు అక్కా చెలెళ్ళు గుర్తించారు. ఇద్దరు పిల్లలు - ఒకరు నాలుగు సంవత్సరాల వయస్సు, మరొకరు కేవలం 27 రోజుల వయసు మాత్రమే.. వీరంతా కలు దేవి పిల్లలుగా గుర్తించారు. మమతా దేవి, కమలేష్ ఇద్దరూ నిండు గర్భిణులు కావడం.. కలు దేవి కేవలం నెల రోజుల క్రితమే ప్రసవించింది. కష్టపడి చదువుకుని జీవనం సాగించాలనుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లను మద్యం మత్తులో ఉండే మగవారితో పెళ్లి చేసినట్లు సమాచారం. అది కూడా బాల్య వివాహం అని తేలింది.
కలు (27), మమత (23), కమలేష్ (20).. కలు ఇద్దరు పిల్లలు బుధవారం నాడు అదృశ్యమయ్యారు. వారిని వెతకడంలో పోలీసులు విఫలమయ్యారు. ముగ్గురు మహిళలు గృహహింసకు గురైనట్లు సమాచారం. కలు దేవిని అత్తమామలు కొట్టడంతో.. 15 రోజులు క్రితం ఆసుపత్రి పాలైంది. ఆమె కంటికి గాయాలు అయినట్లు నివేదించబడింది.
వారి ముగ్గురికి 2003లో బాల్య వివాహం జరిగింది. ఆ సమయంలో అక్కచెల్లళ్ళలో ఆఖరి అమ్మాయి వయసు కేవలం 1 సంవత్సరం మాత్రమే. ఆ ముగ్గురు మహిళలు తమ బతుకుదెరువు కోసం కష్టపడి చదువుకున్నారు. మమత పోలీసు కానిస్టేబుల్ పరీక్షలో ఎంపికైంది, కలు తన బిఎ కోర్సు చివరి సంవత్సరం చదువుతోంది, చిన్న చెల్లెలు కమలేష్ సెంట్రల్ యూనివర్సిటీలో చేరింది. అయినా కూడా భర్తలు టార్చర్ పెడుతూనే ఉన్నారు. వారి ఇళ్లకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావి నుంచి శనివారం వారి మృతదేహాలను వెలికితీశారు. మహిళలు, వారి పిల్లలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా లేక వరకట్నం కోసం అత్తమామలే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.