భ‌ర్త‌ను క‌ట్టిప‌డేసి.. గర్భిణిపై సామూహిక అత్యాచారం

Pregnant woman gang-raped in Pakistan’s Punjab. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని జీలం నగరంలో ఓ గర్భిణిపై ఐదుగురు వ్యక్తులు

By Medi Samrat  Published on  6 Jun 2022 2:48 PM IST
భ‌ర్త‌ను క‌ట్టిప‌డేసి.. గర్భిణిపై సామూహిక అత్యాచారం

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని జీలం నగరంలో ఓ గర్భిణిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు నిందితులు మహిళ ఇంట్లోకి చొరబడ్డారు. బాధితురాలిపై లైంగిక వేధింపులకు ముందు వారు ఆమె భర్తపై దాడి చేసి కట్టిపడేశారు. దాడి అనంతరం మహిళ స్వయంగా ఆస్పత్రికి వెళ్లింది.. బాధితురాలు తనకు జరిగిన బాధను వివరించడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం లాహోర్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసును విచారించేందుకు పంజాబ్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. పంజాబ్ ఐజీపీ సంబంధిత అధికారుల నుంచి నివేదిక కోరింది. మహిళలపై పాకిస్థాన్ లో అత్యాచారాలు అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నాయి. గత నెలలో కరాచీలో కదులుతున్న రైలులో 25 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. దేశ వ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు చోటు చేసుకున్నాయి.










Next Story