మద్యం మత్తులో.. 4 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేసేందుకు కానిస్టేబుల్‌ యత్నం.. కానీ

Policeman picked up 4-year-old boy playing outside his house. షాజహాన్‌పూర్‌ జిల్లాలో ఓ కానిస్టేబుల్‌ చిన్నారిని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించినందుకు సస్పెండ్‌ అయ్యారు. సదర్ బజార్‌లోని మొహల్లా జలాల్

By అంజి  Published on  7 Jan 2022 10:55 AM IST
మద్యం మత్తులో.. 4 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేసేందుకు కానిస్టేబుల్‌ యత్నం.. కానీ

షాజహాన్‌పూర్‌ జిల్లాలో ఓ కానిస్టేబుల్‌ చిన్నారిని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించినందుకు సస్పెండ్‌ అయ్యారు. సదర్ బజార్‌లోని మొహల్లా జలాల్ నగర్‌కు చెందిన మహ్మద్ జావేద్ గురువారం మాట్లాడుతూ.. జనవరి 3న తన నాలుగేళ్ల కుమారుడు ఇంటి బయట ఆడుకుంటున్నాడని, అటుగా వెళుతున్న ముఖేష్ కుమార్ అనే పోలీసు చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. స్థానికులు చిన్నారిని పోలీసుల నుంచి లాక్కెళ్లారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయిందని జావేద్ తెలిపారు. దీంతో సదరు పోలీసుపై సదర్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇంతలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్కడ పోలీసు పిల్లవాడిని తీసుకువెళుతున్న దృశ్యం సీసీటీవీలో రికార్డ్‌ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారిందని, కానిస్టేబుల్ ముఖేష్ కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (నగర్) సంజయ్ కుమార్ గురువారం తెలిపారు. ఈ కేసు దర్యాప్తును పోలీసు ఏరియా అధికారి (నగర్) శ్రవణ్ కుమార్‌కు అప్పగించారు. పోలీసులు చిన్నారిని కిడ్నాప్ చేయలేదని, అయితే సంఘటన జరిగిన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని, వైద్య పరీక్షలు కూడా మద్యం సేవించినట్లు నిర్ధారించారని శ్రవణ్ కుమార్ చెప్పారు. అయితే పోలీసులు తీసుకున్న సస్పెన్షన్ చర్యతో తాను సంతృప్తి చెందలేదని చిన్నారి తండ్రి జావేద్ తెలిపారు. అతను పోలీసుపై నివేదికను దాఖలు చేశాడు. మొత్తం వ్యవహారంపై విచారణకు డిమాండ్ చేస్తున్నాడు.

Next Story