8 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన పోలీసులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..
police solved mystery in just 8 hours. కేవలం 8 గంటల్లో పోలీసులు ఓ వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజస్థాన్‌లోని సవాయిమాధోపూర్
By Medi Samrat Published on 1 Jan 2022 1:29 PM ISTకేవలం 8 గంటల్లో పోలీసులు ఓ వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజస్థాన్‌లోని సవాయిమాధోపూర్ జిల్లాలో జరిగిన హత్య విషయంలో పోలీసులు వేగంగా స్పందించారు. బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని జీవద్ నది సమీపంలో గురువారం ఉదయం ఓ యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మృతుడి హత్యకు ప్లాన్ చేసింది భార్య, ఆమె ప్రియుడేనని పోలీసులకు తెలిసింది. దీంతో అతడి భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరినీ శుక్రవారం కోర్టులో హాజరుపరచగా, పోలీసు కస్టడీకి తరలించారు.
గురువారం ఉదయం 8 గంటలకు బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని జీవద్ నదికి సమీపంలో రోడ్డు పక్కన యువకుడి మృతదేహం కనిపించడంతో కొందరు పోలీసులకు సమాచారం అందించినట్లు సవాయ్ మాధోపూర్ పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారి వివేక్ హర్షనా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తిని విజేందర్ గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి మొబైల్ ఫోరెన్సిక్ విభాగాన్ని పిలిపించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి అదనపు పోలీసు సూపరింటెండెంట్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు అధికారి బమన్వాస్ బ్రిజేష్ మీనా, పోలీసు అధికారి మల్రానా దుంగార్ ధనరాజ్ మీనా, పోలీసు అధికారి బటోడా వివేక్ హర్షనాతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు.
విచారణలో భార్య, ఆమె ప్రియుడే విజేందర్ హత్యకు పాల్పడ్డారని తేలింది. నిందితుడు జస్రామ్, మృతుడి భార్య నిర్మా మీనా (23)లను కేవలం 8 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ సింగ్ తెలిపారు. జస్రామ్ మీనా గావ్‌మోర్పాలో ఉంటున్నాడు. మరణించిన విజేందర్ భార్య నిర్మతో జస్రామ్‌కు చాలా ఏళ్లుగా సన్నిహిత సంబంధం ఉంది, దీనిపై విజేంద్ర.. అతని భార్య ఎప్పుడూ గొడవ పడుతుండేవారు. ఘటన జరిగిన రోజు రాత్రి జస్రామ్ విజేంద్రకు మద్యం తాగించాడు. ఆపై అతడి గొంతుకోసి హత్య చేశాడు. శవాన్ని తీసుకుని వచ్చి దూరంగా పడేశారు.