ఆర్టీసీ బ‌స్సులో నోట్ల కట్టల కలకలం.. భారీగా నగదు పట్టివేత

Police seize Rs. 2 crores from RTC bus. ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున హవాలా డబ్బు పట్టుబడి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

By Medi Samrat  Published on  15 April 2022 11:42 AM GMT
ఆర్టీసీ బ‌స్సులో నోట్ల కట్టల కలకలం.. భారీగా నగదు పట్టివేత

ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున హవాలా డబ్బు పట్టుబడి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పోలీసులు యథావిధిగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. అయితే బస్సులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతని వద్ద పెద్ద బ్యాగ్ ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు వెంటనే అతని బ్యాగును తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో డబ్బు దొరికింది.

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సులో పోలీసులు సుమారు రూ. 2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులో డబ్బు కట్టలు చూసి బస్సులోని ప్రయాణికులతో పాటు పోలీసులు నివ్వెరపోయారు. డబ్బును చిలకల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. డబ్బు ఎక్కడిది అనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story
Share it