ఎట్టకేలకు కిలేడీని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు

రాత్రి సమయంలో రోడ్డుపై నిల్చుని అబ్బాయిలను లిఫ్ట్ అడిగి.. ఆ తర్వాత బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కిలాడీ లేడీని

By Medi Samrat
Published on : 3 Jan 2024 3:16 PM IST

ఎట్టకేలకు కిలేడీని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు

రాత్రి సమయంలో రోడ్డుపై నిల్చుని అబ్బాయిలను లిఫ్ట్ అడిగి.. ఆ తర్వాత బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కిలాడీ లేడీని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సయీదా నయీమా సుల్తానాని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సయీదా రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడిగి.. వాహనంలో ఎక్కి కొద్దిదూరం వెళ్లిన తర్వాత తనను రేప్ చేసేందుకు ప్రయత్నించావని, పోలీస్ స్టేషన్ లో కేసు పెడతానని బెదిరించేది. పోలీసుల దగ్గరకు వెళ్లకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ఆమె కోరేది. దీంతో ఆమె మీద పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇలానే చేసిన ఆమెపై దాదాపు 17 కేసులు ఉన్నాయి. తాజాగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలని కారులో ఎక్కిన నిందితురాలు.. బట్టలు చించుకుని రేప్ కేసు పెడతానని కారు డ్రైవర్‌ను బెదిరించింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కిలాడీ లేడీ సయీదా నయీమా సుల్తానా (32)ను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

తాను లాయర్ అని.. తనకు అన్నీ సెక్షన్లు తెలుసు అంటూ దబాయిస్తూ బెదిరింపులకు గురి చేసేది. ఇటీవల కారు డ్రైవర్ పరమానంద వస్తున్న సమయంలో ఈ లేడీ కిలాడి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుండి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలని కారులో ఎక్కింది... అనంతరం బట్టలు చించుకొని రేప్ కేసు పెడతానంటూ అల్లరి చేసింది. డబ్బులు ఇస్తావా లేక కేసు పెట్టమంటావా అంటూ బెదిరింపులకు గురి చేసింది. కారు డ్రైవర్ పరమానంద భయపడి డబ్బులు ఇచ్చాడు. దీంతో లేడీ కిలాడి కారు దిగి వెళ్ళిపోయింది. అనంతరం కారు డ్రైవర్ పరమానంద జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి ఐపిసి 389 సెక్షన్ కింద కేసు నమోదు చేసి లేడీ కిలాడి సయీదా నయీమా సుల్తానా ను అరెస్టు చేశారు. ఆమె మీద నగర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో 17 కేసులు నమోదయ్యాయి. పలువురు అమాయకుల మీద కూడా కేసులు కూడా పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విచారణ తర్వాత రిమాండ్ కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు.

Next Story