గుట్టుచ‌ప్పుడు కాకుండా ఆ ప‌ని చేస్తూ పోలీసుల‌కు చిక్కారు..!

అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద కంటైనర్‌లో గంజాయి తరలిస్తున్న డ్రైవర్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  20 Feb 2025 7:45 PM IST
గుట్టుచ‌ప్పుడు కాకుండా ఆ ప‌ని చేస్తూ పోలీసుల‌కు చిక్కారు..!

అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద కంటైనర్‌లో గంజాయి తరలిస్తున్న డ్రైవర్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 300 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తిని మహారాష్ట్రలోని పూణేకు చెందిన అహ్మద్ గులాబ్ షేక్ (56) గా గుర్తించారు. వైభవ్, దేవా అనే మరో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు వెళ్లి బుజ్జిబాబు అనే వ్య‌క్తి వద్ద గంజాయి కొనుగోలు చేశారని పోలీసులు తెలిపారు. సరుకును చిన్న ప్యాకెట్లలో చక్కగా ప్యాక్ చేసి కంటైనర్ వాహనంలో తరలిస్తుండగా, సమాచారం మేరకు రాచకొండ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఆపింది. వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయిని గుర్తించినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు తెలిపారు. అహ్మద్, బుజ్జిబాబు తదితరులపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వైభవ్, దేవా, బుజ్జిబాబులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Next Story