కుక్క మెడకు గొలుసును కట్టి ఉరి తీసి పైశాచికానందం

Pet Dog Hanged To Death By 2 Men In UP Shocker. ముగ్గురు వ్యక్తులు పెంపుడు కుక్క మెడకు గొలుసును కట్టి ఉరి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

By Medi Samrat
Published on : 14 Nov 2022 6:45 PM IST

కుక్క మెడకు గొలుసును కట్టి ఉరి తీసి పైశాచికానందం

ముగ్గురు వ్యక్తులు పెంపుడు కుక్క మెడకు గొలుసును కట్టి ఉరి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తులు ఒక కుక్కను చిత్రహింసలకు గురిచేసి, ఆ కుక్క మెడకు ఉరి వేసి ఆనందించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఒక బిల్డింగ్‌ కనస్ట్రక్షన్‌ సైట్‌ వద్ద ముగ్గురు దుండగులు ఒక కుక్క మెడను గొలుసుతో ఒక గోడకు ఉరిలా వేలాడి దీసి రకరకాలుగా హింసించడం మొదలు పెట్టారు. అందుకు సంబంధించిన ఘటన నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఈ సంఘటన కొన్ని నెలల క్రితం ఘజియాబాద్ లోని ఇలైచిపూర్ ప్రాంతంలో జరిగింది, అయితే క్లిప్ వైరల్ అయిన తర్వాత మాత్రమే పోలీసులు దానిని గమనించారు. ఈ దారుణానికి పాల్పడ్డ యజమానిపై కేసు నమోదు చేశారు. కుక్క అనారోగ్యంగా ఉన్నందున చంపినట్లు యజమాని తెలిపారు. యజమానిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) ఇరాజ్ రాజా తెలిపారు. జంతువుపై జరిగిన క్రూరత్వాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఖండించారు. "వీడియో చూసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. జంతువులపై క్రూరత్వం రోజురోజుకు పెరుగుతోంది. మనుషులు కనీసం మానవత్వాన్ని కోల్పోతున్నారు" అని ఆమె ట్వీట్ చేశారు.


Next Story