హైదరాబాద్‌లో దారుణం..వ్యక్తిని బండరాళ్లతో కొట్టిచంపిన దుండగులు

సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

By Knakam Karthik  Published on  13 Feb 2025 7:25 AM IST
Crime News, Telugu News, Hyderabad, Hyd Police, Alwal

హైదరాబాద్‌లో దారుణం..వ్యక్తిని బండరాళ్లతో కొట్టిచంపిన దుండగులు

సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రైల్వే బ్రిడ్జి కింద గుర్తు తెలియని వ్యక్తుల మధ్య ఘర్షణలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. రాళ్లతో దాడికి పాల్పపడటంతో తీవ్ర గాయాలైన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి చేతిపై ఆంజనేయస్వామి పచ్చబొట్టు ఉందని, మెడలో కూడా ఆంజనేయస్వామి లాకెట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.

Next Story