ఊహించ‌ని ప్ర‌మాదం.. చెట్టు మీద ప‌డి వ్య‌క్తి మృతి

సికింద్రాబాద్ లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. చిక్సిత కోసం హాస్పిటల్ కి వెళ్లిన భార్యాభర్తలకు ఊహించ‌ని ప్రమాదం ఎదురైంది

By Medi Samrat
Published on : 21 May 2024 1:09 PM IST

ఊహించ‌ని ప్ర‌మాదం.. చెట్టు మీద ప‌డి వ్య‌క్తి మృతి

సికింద్రాబాద్ లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. చిక్సిత కోసం హాస్పిటల్ కి వెళ్లిన భార్యాభర్తలకు ఊహించ‌ని ప్రమాదం ఎదురైంది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మరణించగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వివ‌రాళ్లోకెళితే.. సికింద్రాబాద్ పరిధిలోని శామీర్‌పేట్‌ తూముకుంటలో రవీందర్, సరళ దంపతులు నివాసం ఉంటున్నారు. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన భార్య భర్తలు ఆసుపత్రికి వస్తున్న క్ర‌మంలో ద్వారం వద్ద ఉన్న ఓ చెట్టు కూలి ఇరువురిపై ప‌డింది. ఈ ప్ర‌మాదంలో రవీందర్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. అతని భార్య సరళా దేవికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకు న్నారు. మృతదేహన్నిపోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయలైనా భార్య సరళను స్థానిక హాస్పిటల్ కి తరలించారు.

Next Story