హోలీ వేడుకల్లో గంజాయి మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్క్రీమ్స్, బర్ఫీ స్వీట్స్..

హైదరాబాద్ నగరంలోని ధూల్‌పేట్ ప్రాంతంలో గంజాయి కలిపిన కుల్ఫీ, ఐస్ క్రీం, స్వీట్లు అమ్ముతున్న ముఠాను స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  14 March 2025 6:17 PM IST
హోలీ వేడుకల్లో గంజాయి మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్క్రీమ్స్, బర్ఫీ స్వీట్స్..

హైదరాబాద్ నగరంలోని ధూల్‌పేట్ ప్రాంతంలో గంజాయి కలిపిన కుల్ఫీ, ఐస్ క్రీం, స్వీట్లు అమ్ముతున్న ముఠాను స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ STF సోదాలు నిర్వహించి 100 కుల్ఫీలు, 72 బర్ఫీ స్వీట్లను స్వాధీనం చేసుకుంది. గంజాయి కలిపిన ఐస్ క్రీం, కుల్ఫీ, స్వీట్లను ఐస్ క్రీం విక్రేత సత్యనారాయణ సింగ్ తయారు చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు.

గంజాయి ముసుగులో జరుగుతున్న హోలీ వేడుకల్లో దాడులు నిర్వహించి గంజాయితో తయారైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి గంజాయిని మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. సత్యనారాయణ పై కేసు నమోదు చేసినట్లు అంజిరెడ్డి తెలిపారు.

Next Story