1,000 కిలోల పేలుడు పదార్థాలతో దౌసాకు చెందిన వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడిని రాజేష్ మీనాగా గుర్తించారు. ఈ పేలుడు పదార్థాలు అక్రమ మైనింగ్ కోసమేనని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు. నిందితుడి వద్ద నుంచి 65 డిటోనేటర్లు, 13 వైర్లు స్వాధీనం చేసుకున్నారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) సురేంద్ర పునియా మాట్లాడుతూ "సమాచారం ప్రకారం, మేము ఒక వాహనాన్ని తనిఖీ చేసాము, అందులో 10 క్వింటాల్ పేలుడు పదార్థాలు. 65 డిటోనేటర్లను కనుగొన్నాము. ప్రాథమికంగా పేలుడు పదార్థాలను అక్రమ మైనింగ్ కోసం ఉపయోగిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ తర్వాత అసలు కారణం తెలుస్తుంది." అని అన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే సోహ్నా-దౌసా స్ట్రెచ్‌ను ఫిబ్రవరి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దౌసాలో జరగబోయే PM మోదీ పర్యటనతో ఈ పేలుడు పదార్థాలకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.