మృతదేహం చేతి మీద రాసి ఉన్నది చూసి షాకైన పోలీసులు
officers stunned as something was written on the palm. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో ఓ యువకుడి ఆత్మహత్య హాట్ టాపిక్ గా మారింది.
By Medi Samrat Published on 13 Jun 2022 2:11 PM ISTమధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో ఓ యువకుడి ఆత్మహత్య హాట్ టాపిక్ గా మారింది. రైలు కింద పడి సదరు బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహంను పరిశీలించగా అరచేతిపై కొన్ని విషయాలను రాసుకొచ్చాడు. అతడి దగ్గర నుండి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొత్వాలి పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ ఏఎస్‌ఐ డబ్బు ఇవ్వాలని చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అందుకే ప్రాణం తీసుకుంటూ ఉన్నానని తన మరణానికి కారణం చెప్పుకొచ్చాడు. ఈ సూసైడ్ నోట్‌ని పోలీసులు విచారణ నిమిత్తం తీసుకున్నారు.
అశోక్‌నగర్‌లోని త్రిలోక్‌పురి కాలనీకి చెందిన 26 ఏళ్ల భూపేంద్ర మహేంద్ర రైలు కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భూపేంద్ర కొంతకాలం క్రితం డాక్టర్ దగ్గర డ్రైవర్ గా పని చేస్తూ ఉండేవాడు. కానీ ఎందుకో అతడు ఉద్యోగం నుండి తీసేయబడ్డాడు. శుక్రవారం ఉదయం కూడా భూపేంద్ర కూలి పనులకు ఇంటి నుంచి వెళ్లాడని భూపేంద్ర అన్న రాజు తెలిపారు. కొత్వాలిలో పోస్ట్ చేయబడిన ఏఎస్ఐ వినోద్ తివారీ తనను ఎంతగానో ఇబ్బందులు పెడుతున్నాడని చెప్పేవాడని రాజు చెప్పుకొచ్చారు. ఏఎస్సై వినోద్ తివారీ నా సోదరుడు భూపేంద్రను గతంలో చాలాసార్లు వేధించాడని, వివిధ కేసుల్లో అరెస్ట్ చేశాడని రాజు తెలిపారు.
భూపేంద్ర రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో త్రిలోక్‌పురి కాలనీలోని రైల్వే ట్రాక్‌పై భూపేంద్ర మృతదేహం పడి ఉందని పోలీసులు తెలిపారు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. విచారణలో, భూపేంద్ర దగ్గర ఒక సూసైడ్ నోట్ కనుగొనబడింది, అందులో అతను ASI వినోద్ తివారీని చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించాడు. మృతుడు తన చేతిపై సూసైడ్ నోట్, పేపర్‌ను కూడా వదిలేశాడు.