పాఠశాల బస్సులో నర్సరీ చిన్నారిపై అత్యాచారం.. మహిళా సహాయకురాలు ఉండి కూడా..!

Nursery kid raped inside school bus in Bhopal. మూడున్నరేళ్ల నర్సరీ స్కూల్ విద్యార్థినిపై స్కూల్ బస్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

By Medi Samrat
Published on : 13 Sept 2022 4:05 PM IST

పాఠశాల బస్సులో నర్సరీ చిన్నారిపై అత్యాచారం.. మహిళా సహాయకురాలు ఉండి కూడా..!

భోపాల్: మూడున్నరేళ్ల నర్సరీ స్కూల్ విద్యార్థినిపై స్కూల్ బస్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళా సహాయకురాలి సమక్షంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ మహిళ ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించింది. దీంతో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. బాధిత బాలిక తల్లి.. శరీరంపై ఉన్న గుర్తులను చూసి ఏమైందని ఆరా తీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

బాధితురాలి కుటుంబం పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించగా.. ఈ ఆరోపణలను ఖండించారు. దీని తర్వాత, పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్‌ను లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద అరెస్టు చేసి, అత్యాచారం కేసు నమోదు చేశారు.నేరాన్ని దాచడానికి ప్రయత్నించిన సహాయకురాలిని కూడా అరెస్టు చేశారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందిస్తూ, నిందితులిద్దరినీ అరెస్టు చేశామని, పాఠశాల యాజమాన్యం కూడా నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దీంతో వారిని కూడా విచారిస్తామని, దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.


Next Story