దొంగలను పట్టించిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్

Number plate recognition camera used to nab vehicle thieves in Delhi. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరా ద్వారా దొంగలను పెట్టేసుకున్నారు.

By Medi Samrat  Published on  6 Nov 2022 7:00 PM IST
దొంగలను పట్టించిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్

ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరా ద్వారా దొంగలను పెట్టేసుకున్నారు. ఢిల్లీలో వాహన దొంగలను పట్టుకోవడంలో పోలీసులకు ఎంతగానో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు సహాయపడుతున్నాయి. ANPR కెమెరాను ఉపయోగించడంతో, దొంగిలించబడిన వాహనం నంబర్ ప్లేట్ నిర్దిష్ట ప్రదేశంలో కొన్ని సార్లు క్యాప్చర్ చేయబడింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు వల వేసి ఇద్దరు నేరగాళ్లను పట్టుకున్నారు.

ఔటర్-నార్త్ డిసిపి దేవేష్ కుమార్ మహ్లా మాట్లాడుతూ, "మోటారు వాహనాల దొంగతనాలను అరికట్టడానికి, నేరస్థులను పట్టుకోవడానికి ఇంటెన్సివ్ డ్రైవ్ ఔటర్-నార్త్ జిల్లాలో ప్రారంభించబడింది. ఈ క్రమంలో పోలీసులు మోటారు సైకిల్‌పై వెళుతున్న నిందితులను వెంబడించి పట్టుకున్నారు. " అని తెలిపారు. నిందితులను అఫ్సర్, కిషన్ కుమార్‌లుగా గుర్తించారు. వారి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వెరిఫికేషన్‌లో ద్విచక్రవాహనం చోరీకి గురైనట్లు తేలింది. ఈ నిందితులు మరో నాలుగు వాహనాలను దొంగిలించగా... వాటిని కూడా రికవరీ చేశారు.


Next Story